ఉద్యోగులు..పెన్షనర్లపై.. చిన్నచూపు..!
1 min read– ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి
– సమస్యలు పరిష్కరించాలంటూ… ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ధర్నా
– భారీ సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు, పెన్షనర్లు..
పల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ,రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని… లేదంటే ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరికుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వై. కెవై కృష్ణ. ఏపిజెఏసి రాష్ట్రకమిటి ఇచ్చిన మలిదశ ఉధ్యమ కార్యచరణలో భాగంగా బుధవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి కుమార్ రెడ్డి, కెవై కృష్ణ, అసోసియేట్ చైర్మన్ నాగరమణయ్య మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల/పెన్షనర్లు ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ఒకటో తేదీనే జీతాలు/పెన్షన్లు చెల్లించాలి, 11 వ PRC ప్రతిపాదించిన స్కేల్స్ బయటపెట్టాలి, పెండింగ్ ఉన్న 4 DA ల అరియర్స్ చెల్లించాలి, 11 వ PRC అరియర్స్ చెల్లించాలి, 12 వ PRC కమిషనర్ వెంటనే నియమించాలి, పెండింగ్ ఉన్న మూడు కొత్త DA లను విడుదల చెయ్యాలి, పెన్షనర్ల కు చెల్లించాల్సి డిఆర్ లను వెంటనే చెల్లించాలి, CPS రద్దు చేసి OPS పునరుద్ధరించాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి, EHS ద్వారా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో అమలు జరపాలి, కొత్త జిల్లా కేంద్రాలన్నిటిలోను 16% HRA ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో apjac అమరావతి చైర్మన్ మరియు ప్రధాన కార్యదర్శి గిరి కుమార్ రెడ్డి మరియు కె.కృష్ణ, వారితో పాటు సహకార సంఘం నాగరమణయ్య, APPTD ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆ.వీరెడ్డి, శ్రీనివాసులు, పంచాయత్ రాజ్ ఇంజనీర్లు అసోసియేషన్, రవీంద్రారెడ్డి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, నాగేశ్వరరావు టైపిస్ట్ మరియు స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయక్, పెన్షనర్స్ అసోసియేషన్, శంకరప్ప, DRDA ఉద్యోగుల సంఘం, గిడ్డయ్య, VRO అసోసియేషన్, సూరి బాబు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రతాప్ , కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్, మున్సిపల్ ఉపాధ్యాయ సంఘం నాయకులు తదధితరులతోపాటు అధికసంఖ్యలో ఉద్యోగులు పెన్షనర్లు పాల్గొన్నారు.