ఇంటర్నేషనల్ లయన్స్ రీజియన్ చైర్ పర్సన్ (ఆర్.సి) గా ఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర్లు
1 min read
లయన్స్ క్లబ్స్ ద్వారా వివిధ హోదాల్లో దేవరకొండ సమాజానికి సేవలు
లయన్స్ ఆశీస్సులతో ఆశయాలను సమిష్టిగా సాధిస్తాo
డి.ఇ దేవరకొండ వెంకటేశ్వర్లు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఇంటర్నేషనల్ లయన్స్ రీజియన్ చైర్ పర్సన్ (ఆర్.సి) గా ఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర్లునియమితులయ్యారు.గత దశాబ్దపు కాలం నుంచి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ద్వారా వివిధ హోదాల్లోఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర్లు సమాజానికి అందిస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకొని వారిని రీజియన్ చైర్ పర్సన్ గా నియమించామని లయన్స్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2026-27 గవర్నర్ డాక్టర్:దశక సుబ్బారావు ప్రకటించారు.ఈ సందర్బంగా నియామక పత్రాన్ని,లయన్స్ నియమావళిని లయన్స్ డిస్ట్రిక్ట్ కాబినెట్ సెక్రటరీ లేళ్ళ వెంకటేశ్వరరావు సమక్షంలో దేవరకొండకు బహుకరించారు.ఆర్సీ కి కేటాయించిన రీజియన్ లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు వారికి సహకారంగా రీజియన్ సెక్రటరీ గా వి. వెంకట నాగ లక్ష్మీ , జోనల్ చైర్ పర్సన్స్ గా సి.హెచ్ పావని,కడియం, వి.సి.డి. ప్రసాద్,ఎం.శ్రీనివాసరావు లను నియమించామని డాక్టర్: సుబ్బారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుజాత, నాగ శేషు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన రీజియన్ ఛైర్పర్సన్ గా అవకాశం కల్పించిన ఎలక్టెడ్ గవర్నర్ డాక్టర్ సుబ్బారావు బృందానికి ధన్యవాదాలు తెలిపి, ఇంటర్నేషనల్ లయన్స్ ఆశయ సిద్ధికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఇటు సంఘ సేవలోనూ, అటు లయన్స్ పరిపాలనలోను తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తానని ఆయన మాటిచ్చారు. లయన్స్ సీనియర్ నాయకులు కే.వి.కిషోర్ కుమార్,పి. విజయ భాస్కర్ రెడ్డి, సి.హెచ్. అవినాష్ రాజు,వేమా కోటేశ్వరరావు, కాకరాల వేణు బాబు,ఆర్.వి.ఎస్.సూర్య నారాయణ రాజు,వి.సత్య స్వరూప్,కూర్మ శ్రీనివాసరావు, హేమలత,తదితర ప్రభుతుల సలహా సంప్రదింపులు, ఆశీస్సులతో లయన్స్ ఆశయాలను సమిష్టిగా సాధిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు.

