మరింత తగ్గనున్న వంటనూనె ధరలు
1 min readపల్లెవెలుగువెబ్ : వంట నూనెల ధరల మంట మరికొంత చల్లారనుంది. నూనెల ధరలను లీటరుపై 10 రూపాయల దాకా తగ్గించాలని కేంద్రప్రభుత్వం వంట నూనెల కంపెనీలను ఆదేశించింది. వారం రోజుల్లోగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరింది. తగ్గించిన మేరకు ఎంఆర్పీలో మార్పులు చేయాలని సూచించింది. అంతర్జాతీయంగా నూనెల ధర తగ్గడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి సుధాన్షు పాండే బుధవారం నూనెల తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.