ప్రతిఒక్కరూ దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి : ఎస్ఐ జయరాములు
1 min read
పల్లెవెలుగు వెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి: ప్రతిఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం ఎస్ ఐ జయరాములు పేర్కొన్నారు. శుక్రవారం మండలపరిధిలోని రాయచోటి వేంపల్లి రహదారి లో కుమ్మరపల్లి సమీపంలో వాహనదారులను ఆపి దిశ యాప్ డౌన్లోడ్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆపదలో ఉన్నప్పుడు దిశ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు చదువుకున్న యువతీ యువకులు అవగాహన కల్పించాలన్నారు.తద్వారా మహిళలకు క్లిష్ట పరిస్థితులలో ఆపద్బాంధవుడిలా దిశ యాప్ ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.