అసాధారణ సాహితీవేత్త ..విశ్వనాధ సత్యనారాయణ
1 min readపల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: మహాకవి ఆధునిక సాహితీవేత్త లలో అసాధారణమైన కృషిచేసిన మహనీయులు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అని మహా కవయిత్రి మొల్ల సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు పేర్కొన్నారు, మంగళవారం మండలంలోని శాటిలైట్ సిటీ వద్ద కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 47వ వర్ధంతిని పురస్కరించుకొని, ఆయనను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి మొల్ల సాహితీ పీఠం కార్యవర్గ సభ్యులు పూలమాలవేసి మౌనం పాటించి అనంతరం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ విశ్వనాథ సత్యనారాయణ వివిధ సాహితీ ప్రక్రియలలో సృషించిన ఇతర రచనలు చేసి తెలుగు సాహితీ వనం లో ఒక కొత్త ఒరవడి సాధించారని తెలిపారు, అంతేకాకుండా తెలుగు సాహిత్యములో మొట్టమొదటి జ్ఞాన పీఠ అవార్డు ను స్వీకరించిన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ అని కొనియాడారు, అలాంటి మహోన్నత వ్యక్తికి నివాళులర్పించడం నిజంగా తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలియజేశారు, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన రచించిన ఎన్నో తెలుగు సాహితీ స్మృతులు మనల్ని అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మహా కవయిత్రి సాహితీ పీఠం ఉపాధ్యక్షులు రాఘవ రాజు, పట్టాభి రామ రాజు, మహిళా కార్యదర్శులు స్వర్ణలత, పార్వతి, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.