సాగునీరు పంపిణీ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం.. మాజీ మంత్రి బుగ్గన
1 min read
పల్లెవెలుగు, ప్యాపిలి:చెరువులకు సాగునీరు పంపిణీ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల పరిధిలోని గుడిపాడు చెరువును ఆయన వైసీపీ నాయకులతో, కార్యకర్తలతో పర్యటించారు. సాగునీరు పంపిణీ చేస్తున్న పైపును గుర్తుతెలియని దుండగులు కట్ చేసి తీసుకువెళ్లారు, వీటిని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు ఇలా జరిగింది దీన్ని కనిపెట్టడానికి కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఆయన ఎద్దేవ చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు ,రైతులకు తగు న్యాయం చేసింది అంటే అది వైసిపి ప్రభుత్వం మాత్రమే అని అని అన్నారు. 2024 సంవత్సరం సెప్టెంబర్ లో చెరువులోకి నీరు నింపాల్సిన కార్యక్రమం 2025 సంవత్సరం ఫిబ్రవరి నాటికి కూడా చెరువులకు నీరు అంతక పోవడం చాలా దురదృష్టకరం అన్నారు. చెరువులకు నిరు నింపడంతో రైతుల పొలాల్లో ఉన్న బోర్లు రీఛార్జ్ అవుతాయని వారు రైతా సంఘం చేసుకుంటారని వారికి నీరు లేకపోతే వలసలు పోయితారు,లెదంటే రైతుల అప్పుల పాలై ఆత్మహత్యలకు దారి తీసే ప్రయత్నం ఎంతైనా ఉందని వీటిని కూటం ప్రభుత్వం అర్థం చేసుకుని చెరువులకు నిరు నింపే కార్యక్రమం త్వరగా చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, బోరా మల్లికార్జున్రెడ్డి, మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టి వెంకటేశ్వర్ రెడ్డి,మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గడ్డం భూనేశ్వర్ రెడ్డి, మండల కన్వీనర్ పోతుదోడ్డి కృష్ణమూర్తి, బోరెడ్డి రఘునాథ్ రెడ్డి, రాజా మురళి కృష్ణ, బషీరు, రామ్మూర్తి ,కృష్ణారెడ్డి, నాగరాజు, పాండు, తదితరులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
