PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

120 మందికి పైగా ట్రావెల్ ఏజెంట్లతో అవగాహన

1 min read

– గల్ఫ్ దేశాలలో ఇబ్బందులు పడుతున్న వారిపట్ల భాద్యతగా వ్యవహరించాలి
– జిల్లా ఎస్ పి హర్షవర్ధన్ రాజు ఐ పి ఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: గల్ఫ్ దేశాలలో ఇబ్బందులు పడుతున్న వారి పట్ల బాధ్యత గా వ్యవహరించాలని అన్నమయ్య జిల్లా ఎస్ పి హర్షవర్ధన్ రాజు గారు పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం లో విదేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాల పేరిట పలువురు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిల్లా లోని సుమారు 120 మందికి పైగా ట్రావెల్ ఏజెంట్లతో అవగాహనా కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్.ఏర్పాటు చేయడమైనది ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళాలనే ఉద్దేశ్యం తో ట్రావెల్ ఏజంట్లయిన మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన వివరాలు మరియు అక్కడకు వెళ్ళిన తరువాత చేయవలసిన పనుల గురించి అవగాహన కల్పించాలన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని సురక్షతంగా పంపించాలని అలాగే విదేశాలకు వెళ్ళు వారుకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఏజెంట్లు కు ఉందని జిల్లా ఎస్పీ గారు తెలియజేసారు. అన్నమయ్య జిల్లా లో సుమారు 40% పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తుంటారు కనుక గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనే ఉద్దేశముతో ఎజంట్లయిన మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన వివరాలు మరియు అక్కడకి వెళ్ళిన తరువాతే చేయవలసిన పనుల గురించి అవగాహన కల్పించాలి. గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కొరకు వెళ్ళిన వారు అక్కడ ఏమైనా ఇబ్బందులు పడుతుంటే ఏజెంట్లు భాద్యత గా వ్యవహరించి అక్కడ ఉన్న వారితో మాట్లాడి వారికి బరోసా కల్పించి వారికి చేయూత నివాలని, గల్ఫ్ దేశాలలో ఇబ్బందులు పుతున్న వారిపట్ల మానవత హృదయం తో స్పందించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు ఒకవేళ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తరువాత వారు ఏవైనా ఇబ్బందులకు లోనయితే వారికి ఆ సమస్యలనుంచి ఎలా బయటపడాలి, ఎవరిని కలవాలి అనే విశయాలను తెలియజేస్తూ వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ సమావేశంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి యొక్క కస్తాల గురించి ఏజెంట్లకు సూచించడం జరిగింది . ఏజెంట్లు ఎవరైనా డబ్బులకోసం ఆశపడి అక్రమ మార్గాల ద్వారా నకిలీ వీసాలతో ఎవరినైనా విదేశాలకు పంపినా, వెళ్ళిన వారికి సరైన ఉపాధి కల్పించాకుండా మోసం చేసినా అట్టి వారిపై కటిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారెతో పాటు గారు,స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పీ శ్రీనివాస రావ్ గారు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author