ఫెడ్ దెబ్బకు.. కుదేలైన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. యూస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సూచీలు బలహీనంగా కదలాడాయి. వాటి ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఈ రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో ఐటీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయి 16,953 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.