NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ‌ర్భాశ‌యంలో ఫైబ్రాయిడ్స్: శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేదు!

1 min read

అందుబాటులో మ‌రెన్నో చికిత్స మార్గాలు

ఫైబ్రాయిడ్ల అవ‌గాహ‌న మాసంగా జూలై

రివియా వాస్క్యుల‌ర్ ఇన్‌స్టిట్యూట్ స‌హ‌వ్యవ‌స్థాప‌కుడు, ఇంట‌ర్వెన్షన‌ల్ రేడియాల‌జిస్ట్ డాక్టర్ అర్జున్ రెడ్డి

హైద‌రాబాద్, న్యూస్​ నేడు: మ‌హిళ‌ల‌కు ఉన్న ఆరోగ్య స‌మ‌స్యల్లో చాలా ఎక్కువ‌గా ఉన్నా, చాలామంది పెద్దగా ప‌ట్టించుకోని స‌మ‌స్య‌.. గ‌ర్భాశ‌యంలో ఫైబ్రాయిడ్స్. 25 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న మ‌హిళ‌ల్లో ప్రపంచ‌వ్యాప్తంగా 30-40% మందిని ప్రభావితం చేస్తున్న ఈ స‌మ‌స్య భార‌తీయుల్లో మ‌రింత ఎక్కువగా ఉంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తెలుస్తోంది. వీటిని చాలావ‌ర‌కు గుర్తించ‌డం లేదు, చికిత్స చేయ‌ట్లేదు. క్యాన్సర్ కాని ఈ ఫైబ్రాయిడ్లు.. గ‌ర్భాశ‌య కండ‌ర కుహ‌రంలోప‌ల పెరుగుతాయి. దీని ల‌క్ష‌ణాల్లో రుతుక్ర‌మంలో ర‌క్తస్రావం ఎక్కువ‌గా కావ‌డం, క‌డుపునొప్పి, బ్లోటింగ్‌, త‌ర‌చు మూత్రవిస‌ర్జకు వెళ్లాల్సి రావ‌డం లాంటివి ఉంటాయి. అయినా చాలామంది చికిత్సకు వెళ్ల‌రు. దీంతో ఈ స‌మ‌స్యలు చివ‌ర‌కు హిస్టరెక్టమీకి వెళ్లేవ‌ర‌కు వ‌స్తున్నాయి. గ‌ర్భాశ‌యం లోప‌ల పెరిగే ఈ ఫైబ్రాయిడ్ల వ‌ల్ల గ‌ర్భాశ‌యం ఆకారం మారిపోయి, లోప‌ల పిండం రూపొంద‌దు. గ‌ర్భాశ‌య కండ‌రం బాగా లోప‌ల పెరిగే ఈ ఫైబ్రాయిడ్ల వ‌ల్ల గ‌ర్భాశ‌య లైనింగ్‌కు ర‌క్తస‌ర‌ఫ‌రా త‌గ్గడం, లేదా ఫాలోపియ‌న్ ట్యూబ్‌ల‌కు అడ్డం ప‌డ‌డం, అండం ఉత్పత్తి కావ‌డం, ఫ‌ల‌దీక‌ర‌ణ‌, పిండం పెర‌గడం లాంటి వాటిలో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫైబ్రాయిడ్ల వ‌ల్ల గ‌ర్భస్రావం, నెల‌లు నిండ‌క‌ముందే పుట్టడం, ప్రస‌వం స‌మ‌యంలో స‌మ‌స్యల్లాంటివి కూడా రావ‌చ్చు. ఈ ఫైబ్రాయిడ్లు అత్యంత సూక్ష్మస్థాయి నుంచి ద్రాక్ష పండు కంటే పెద్దగా వ‌ర‌కు ఉంటాయి. ఇవి గ‌ర్భాశ‌యంతో పాటు రోజువారీ జీవ‌నాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ప‌నిలో ఉత్పాద‌క‌త‌, వ్యక్తిగ‌త సంబంధాలు, పిల్ల‌లు పుట్టే విష‌యాల్లోనూ స‌మ‌స్యలొస్తాయి. ఫైబ్రాయిడ్లన్నింటికీ చికిత్స అవ‌స‌రం లేదు. అయితే, 25% మంది మ‌హిళ‌ల‌కు తీవ్ర ల‌క్షణాలు ఉండ‌డంతో చికిత్స అవ‌స‌రం అవుతుంది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రీషియ‌న్స్ అండ్ గైకాల‌జిస్ట్స్ (ఏసీఓజీ) స‌మాచారాన్ని బ‌ట్టి తెలుస్తోంది. హిస్టరెక్టమీ, మ‌యోమెక్టమీ దీనికి ప‌రిష్కారాలు. కానీ ఈ రెండూ పెద్ద శ‌స్త్రచికిత్స‌లే కావ‌డంతో కోలుకోడానికి స‌మ‌యం ఎక్కువ ప‌డుతుంది. హిస్టక్టమీ చేయించుకుంటే ఇక పిల్ల‌లు పుట్ట‌రు. హిస్టరెక్టమీ వ‌ల్ల దీర్ఘకాల స‌మ‌స్యలుంటాయి. చిన్నవ‌య‌సులో చేయించుకుంటే పెల్విక్ ఫ్లోర్ పనిచేయ‌క‌పోవ‌డం, మూత్రం ఆపుకోలేక‌పోవ‌డం, పెల్విక్ ఆర్గాన్ ముందుకురావ‌డం లాంటి స‌మ‌స్యలు రావ‌చ్చు. బీజ‌కోశాలు (ఓవ‌రీ) కూడా ప్ర‌భ‌వితం అయితే హార్మోన్ల అస‌మ‌తుల్య‌త ఏర్ప‌డి జీవ‌న‌నాణ్యత దెబ్బతింటుంది.

స‌రైన ప‌రిష్కారం ఏంటి?

అందుకే యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేష‌న్ (యూఎఫ్ఈ) ప్రపంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన‌, సుర‌క్షిత‌మైన‌, కోతల్లేని చికిత్సా ప్రత్యామ్నాయం. యూఎఫ్ఈ వ‌ల్ల మ‌హిళ‌ల పునరుత్పాద‌క ఆరోగ్యం బాగుంటుంది, భ‌విష్యత్తులో స‌మ‌స్యలు ఉండ‌వు. ఫైబ్రాయిడ్ల వ‌ల్ల గ‌ర్భాశ‌యం బాగా పాడ‌వ్వక‌ముందే యూఎఫ్ఈ చేస్తే పున‌రుత్పాద‌క ప‌లితాలు కూడా బాగుంటాయి.

యూఎఫ్ఈ అంటే ఏంటి..

యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజ‌ష‌న్ (యూఎఫ్ఈ) అనేది.. ఇమేజింగ్ ఆధారిత, శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేని చికిత్స‌. దీన్ని ఇంట‌ర్వెన్షన‌ల్ రేడియాల‌జిస్టులు చేస్తారు. స‌న్నటి క్యాథెట‌ర్ ఉప‌యోగించి, ఫైబ్రాయిడ్లకు ర‌క్తస‌ర‌ఫ‌రా చేసే ర‌క్తనాళాల‌ను బ్లాక్ చేస్తారు. దాంతో అవి స‌న్నబ‌డిపోతాయి, అదే స‌మ‌యంలో గ‌ర్భాశ‌యానికి ఏమీ కాదు.

సాధార‌ణ శ‌స్త్రచికిత్స‌లతో పోలిస్తే ఉండే ప్రయోజ‌నాలు

చికిత్స స‌మ‌ర్థత: యూఎఫ్ఈ చేసిన త‌ర్వాత 85–90% మ‌హిళ‌ల‌కు ల‌క్షణాలు చాలావ‌ర‌కు త‌గ్గాయి

కోలుకునే స‌మ‌యం, ఆస్పత్రిలో ఉండ‌డం: చాలామంది 24  గంట‌ల్లోపే ఇంటికి వెళ్తారు, 7–10 రోజుల్లో తేలిక‌పాటి ప‌నులు చేసుకోవ‌చ్చు.

భ‌ద్రత‌: యూఎఫ్ఈ వ‌ల్ల పెద్ద స‌మ‌స్య‌ల రేటు 1% లోప‌లే ఉంటుంది. దీంతో ఫైబ్రాయిడ్ల చికిత్సల్లో ఇది సుర‌క్షిత‌మైనది.

సంతాన‌సాఫ్యంపై ప్రభావం: పిల్ల‌లు పుట్ట వ‌య‌సులో ఉన్న మ‌హిళ‌ల‌కు గ‌ర్భాశ‌యాన్ని కాపాడ‌డం చాలా ముఖ్యం. యూఎఫ్ఈ వ‌ల్ల పిల్ల‌లు పుట్టే సామ‌ర్థ్యం అలాగే ఉంటుంది.

అవ‌గాహ‌న ఎందుకు అవ‌స‌రం

ఇన్ని ర‌కాల సానుకూల‌త‌లు ఉన్నా యూఎఫ్ఈని మ‌న దేశంలో అంత‌గా ఉప‌యోగించ‌డం లేదు. చాలామంది మ‌హిళ‌లు అన‌వ‌స‌రంగా మయోమెక్టమీలు, హిస్టరెక్టమీలు చేయించుకుంటున్నారు. వారికి ఈ త‌ర‌హా చికిత్సల గురించి చెప్పట్లేదు. రివియా వాస్క్యుల‌ర్ ఇన్‌స్టిట్యూట్‌లో అవ‌గాహ‌న‌, త్వర‌గా గుర్తించ‌డం, రోగుల ఆధారిత చికిత్సల‌కు ప్రాధాన్యం ఇస్తాం. ఇక్కడి ఇంట‌ర్వెన్షన‌ల్ రేడియాల‌జీ బృందానికి అత్యాధునిక‌మైన యూఎఫ్ఈ లాంటి చికిత్సల్లో ప్రత్యేక నైపుణ్యం ఉంది. స‌రైన స‌మ‌యానికి, సాక్ష్యాధారాల ఆధారిత ప‌రిష్కారాల‌తో చికిత్స చేస్తూ.. రోగులు త్వర‌గా కోలుకునేలా, వారి సంతాన సాఫ‌ల్యత‌ను కాపాడేలా చూస్తాం.జూలై నెల‌ను గ‌ర్భాశ‌య ఫైబ్రాయిడ్ల అవ‌గాహ‌న మాసంగా నిర్వహిస్తారు. వీటిగురించి ఆలోచించి, స‌రైన చికిత్స‌ల‌వైపు వెళ్లడానికి ఇదే స‌రైన స‌మ‌యం. రుతుస్రావం స‌మ‌యంలో విప‌రీత‌మైన నొప్పి, పొత్తిక‌డుపులో అసౌక‌ర్యం, ర‌క్తస్రావం ఎక్కువ‌గా కావ‌డం సాధార‌ణ ల‌క్షణాలు కావు. ఇవ‌న్నీ కోత‌లు అవ‌స‌రం లేని చికిత్స చేయించుకోవ‌డానికి  ముంద‌స్తు ల‌క్షణాలు.

About Author