NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`న‌న్ను స్పూర్తిగా తీసుకుని పోరాడండి` : ఆర్ఆర్ఆర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయ‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పేర్కొన్నారు. న్యాయ‌మైన డిమాండ్ల కోసం పోరాడేవారిని తెచ్చుకోవాల‌ని అన్నారు. క్ష‌వ‌రం అయింద‌ని ఓట‌ర్ల‌కు రెండేళ్ల తర్వాత తెలిసింద‌న్నారు. ఉద్యోగుల‌కు సీఎం జ‌గ‌న్ శ‌ఠ‌గోపం పెట్టార‌ని విమ‌ర్శించారు. క్ష‌వ‌రం అయితేగాని వివ‌రం రాద‌నేలా ఉద్యోగ సంఘాల ప‌రిస్థితి ఉందని, అంద‌రూ దివాళ తీసి కొంప‌లు అమ్ముకోవాల‌ని అన్న‌ట్టుగా ఉంద‌ని అన్నారు. నా పుట్ట‌లో వేలు పెడితే కుట్ట‌నా అన్న‌ట్టు ఏపీలో ప‌రిస్థితులు ఉన్నాయ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న పీఆర్సీ కొన‌సాగితే చాల‌న్న ప‌రిస్థితి ఉద్యోగుల్లో ఉంద‌ని పేర్కొన్నారు.

                                

About Author