NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పింఛన్​ డ‌బ్బుతో ప‌రారీ.. వాలంటీర్ కోసం గాలింపు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అనంత‌పురం జిల్లాలో ఓ వాలంటీరు చేతివాటం ప్రద‌ర్శించారు. కొత్త చెరువు మండ‌లం బైరాపురం ఒక‌టో క్లస్టర్ కు చెందిన వాలంటీరు మ‌ధుసూద‌న్ రెడ్డి పింఛను డ‌బ్బుతో పరారీ అయ్యారు. శ‌నివారం పంచాయ‌తీ కార్యద‌ర్శి పింఛన్​ డ‌బ్బును ఆయా క్లస్టర్ల వాలంటీర్లకు అందించారు. కానీ, మ‌ధుసూద‌న‌రెడ్డి ల‌బ్దిదారుల‌కు పింఛన్​ పంపిణీ చేయ‌లేదు. దీంతో ల‌బ్ధిదారులు సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు మ‌ధుసూద‌న‌రెడ్డి ఇంటి వ‌ద్ద ఆరా తీయగా.. ఇంటికి రాలేద‌ని కుటుంబ స‌భ్యులు స‌మాధానం ఇచ్చారు. 1,05,500 రూపాయ‌ల‌తో వాలంటీరు మ‌ధుసూద‌న్ రెడ్డి ప‌రారీ అయ్యారు. వాలంటీరు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

About Author