సినీ నిర్మాతలు ఏపీమంత్రి పేర్నినానితో భేటి!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: తెలుగు సినీపరిశ్రమ నిర్మాతల బృందం రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. ఈమేరకు వారు ఆన్లైన్ టికెటింగ్ విధానం, ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు. ఓవైపు జనసేన నేత, సినీహీరో పవన్కళ్యాణ్ ప్రభుత్వం పాలనతీరుపై తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటే…మరోవైపు ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాతలు రాష్ట్ర మంత్రి పేర్నినానితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రిని కలిసిన వారిలో నిర్మాతలు దిల్రాజు, బన్నివాసు, దానయ్య తదితరులు ఉన్నారు. అయితే పవన్కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతోన్న విధానం పట్ల ఇండస్ట్రీ పెద్దల నుంచి విముఖత వ్యక్తమవుతోందని మంత్రి నాని పేర్కొన్నారు.