ఓబులేష్ కుటుంబానికి రూ.1.11 లక్షల ఆర్థిక సాయం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: మహా సిమెంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న బోచేర్వుపల్లి ఓబులేష్ మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి తోటి డ్రైవర్లు అండగా నిలిచారు. మహా సిమెంట్ డ్రైవర్లు అందరూ కలిసి రూ.1,11,500 ఆర్థిక సాయాన్ని ఓబులేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ ఓబులేష్ కుటుంబానికి తమ వంతు సహాయంగా ఈ మొత్తాన్ని అందజేశామని, కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. తోటి ఉద్యోగులు చూపిన మానవత్వాన్ని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.


