మట్టి కార్యక్రమాలకు వీరమ్మకు ఆర్థిక సహాయం
1 min read
అనాధలైన వృద్ధ దంపతులు ఈరమ్మ నేడు భర్త ఓబులేష్ స్వామి మృతి
కన్నబిడ్డలు గెంటేశారు సమాజం దగ్గర తీసుకుంది
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : హలహర్వీ గ్రామంలో ఓబులేష్ స్వామి చనిపోయిన విషయం తెలుసుకుని హుటాహుటిన గ్రామ మాజీ సర్పంచ్ దాసు పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సింగనేటి నరసన్న జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మణికుమార్ వెళ్లి చూసి భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మట్టి కార్యక్రమాలకు వీరమ్మకు ఆర్థిక సహాయం అందజేసి ఆమెను ఓదార్చి నిన్ను చూసుకోవడానికి సొసైటీ ఉందని ధైర్యం చెప్పారు వీరి కన్నబిడ్డలు వీరి బాగోగులు చూడకపోవడంతో అనాధలై రోడ్డున పడ్డారు ఓబులేష్ స్వామి కి రెండు కళ్ళు కనిపించకపోవడంతో వీళ్ళ పరిస్థితి మరి దయనీయంగా మారింది గత మూడు నెలల క్రితం పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సింగనేటి నరసన్న మూడు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు ఆ గ్రామ ప్రజలు వారికి ఇంటి నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు.హలహర్వీ గ్రామం ప్రజలకు పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు సింగనేటి నరసన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో బహుజన ఆటో యూనియన్ గ్రామ అధ్యక్షులు మడ్రి దస్తగిరి ఉపాధ్యక్షులు ఎర్రన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.