పండ్ల తోటల పెంపకంతో రైతులకు ఆర్థిక భరోసా
1 min read
హొళగుంద న్యూస్ నేడు : చిన్న సన్నకారు రైతులకు పండ్ల తోటల పెంపకంతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యం తో కూటమి ప్రభుత్వం మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేయడం జరుగుతోందని హోళగుంద మండల ఎం పీ డి ఓ విజయలలిత అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం హోళగుంద మండల కేంద్రంలో రైతు బడేఘర్.అబ్దుల్ రహిమాన్ పొలంలో కొబ్బరి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న సన్న కారు రైతులు తోటల పెంపకంతో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవచ్చని అన్నారు. ఆసక్తి అర్హత గల రైతులు పొలం పట్టాదారు పాసుపుస్తకం, రైతు ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు జిరాక్స్ కాపీలతో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మంజు, టిడిపి మండల నాయకులు తిప్పయ్య,జనసేన మండల కన్వీనర్ అశోక్,బీజేపీ నాయకులు ప్రసాద్,ఉలీగన్న, కూటమి నాయకులు ఈరప్ప, మల్లీ, సిబిఎన్ ఆర్మీ మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
