NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రంలోని హోగార్డుల సమస్యలకు పరిష్కారం చూపండి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నియమితులైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేయించేందుకుగాను, వారి సమస్యలు, డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ..  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జూన్‌, 2014 తరువాత ఆంధ్రప్రదేశ్‌ స్థానికతకు చెందిన హోమ్‌ గార్డ్స్‌ తెలంగాణలో ఉండిపోవాలసి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి క  స్థానికత ప్రకారం మార్చినప్పటికీ, హోంగార్డులను మార్చలేదు. హోంగార్డ్స్ కానిస్టేబుల్ గా చాలా మంది రిక్రూట్ అయ్యారు అదేవిధంగా హోంగార్డ్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి వాటిలలో మాకు అవకాశం ఇయ్యాలని కోరుకుంటున్నాం  రాష్ట్రంలోని హోగార్డుల సమస్యల పరిష్కారంపైన, తెలుగు రాష్ట్రాల మధ్య బదిలీల వ్యవహారంపైన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరం. నిత్యం తమ విధులతోను, కుటుంబాలకు దూరంగా ఉంటూ అంకిత భావమైన సేవలందిస్తున్న విషయం మీకు విదితమే. 15 సంవత్సరాల క్రితం ఉమ్మడి హోమ్‌ గార్డు ఉద్యోగం కోసం తెలంగాణలోను, కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోను ఉంటూ వారి విధులు కొనసాగిస్తున్నారు. హోంగార్డుల అసలు విధులతోపాటు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లల్లో అనధికారిక సేవలకు వినియోగించుకుంటున్నారు. హోమ్‌ గార్డుల ఉద్యోగం తెలంగాణలోను, కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం వలన వారు మానసికంగాను, కుటుంబపరంగాను విధులకు వెళ్లడానికి రవాణపరంగా, ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అదే తరహాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన హోంగార్డులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 11సంవత్సరాలు అవుతున్నప్పటికీ, స్వరాష్ట్రాలకు వెళ్లాలని ఎదురుచూస్తున్న హోమ్‌ గార్డుల సమస్యల్ని ఇప్పటికే అనేక మార్లు మీ దృష్టికి, హోంమంత్రి వంగలపూడి అనిత గారికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారమవ్వలేదు.  తమరు హోమ్‌ గార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణలో పనిచేస్తున్న వారిని రాష్ట్రానికి వచ్చేలా కృషిచేయాలని అనేకసార్లు మీకు లేఖలు రాసినప్పటికీ, మీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హోమ్‌ గార్డుల తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండంటం వలన, వారిని చూసుకోలేకపోతున్నారు. ఒక వైపు వారి పిల్లలు తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను చదువుతున్నారు. వారి బదిలీలు సకాలంలో కొనసాగకపోవడంతో భవిష్యత్తులో రాష్ట్ర స్థానికతను కోల్పోవాలిసి వస్తుంది. చిన్నస్థాయి ఉద్యోగులు, వారి కుటుంబ, ఆర్థిక పరిస్థితులు దృష్టా హోంగార్డులు తెలంగాణలో పనిచేయడం ఉండిపోవడం వలన వారి కుటుంబాల పరిస్థితి హోమ్‌ గార్డుల తల్లితండ్రులు వృద్ధాప్యంలో ఉండంటం వలన, వారిని చూసుకోలేకపోతున్నారు. హోమ్‌ గార్డుల పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. వారు భవిష్యత్తులో రాష్ట్ర స్థానికతను కోల్పోవాలిసి వస్తుంది. హోమ్‌ గార్డుల చిన్న స్థాయి ఉద్యోగులు, వారి కుటుంబం, ఆర్థిక పరిస్థితులు దృష్టా హోంగార్డులు తెలంగాణలో పనిచేస్తూ ఉండిపోవడం వల్ల వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా మీ ప్రభుత్వం సత్వరమే స్పందించి హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నాం.

About Author