ఆస్పరి మండలంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం
1 min read
న్యూస్ నేడు ఆలూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు .నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,ఐటి ,మానవ వనరుల,విద్యాశాఖ మంత్రి వర్యులు .నారాలోకేశ్ బాబు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు .పల్లా శ్రీనివాస్ రావు యాదవ్ ఆదేశానుసారం…ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి,.వీరభద్రగౌడ్ ఆస్పరి మండలంలోని తంగరడోన గ్రామాలలో పర్యటించారు..ముఖ్యంగా ఇంచార్జి వర్యులు ప్రజల దగ్గరకు ఇంటింటికి వెళ్లి సూపర్-6 పథకాల గురించి వారికి వివరించి,ముక్యంగా ఆదోని మెయిన్ రోడ్ నుండి గ్రామంలోకి 7Km అప్రోచ్ రోడ్డు అలాగే స్కూల్ దగ్గర, గ్రామ బస్టాండ్ సర్కిల్ లో రెండు బోర్లు,అలాగే గత 6సంవత్సరాలనుండి ఆగిపోయిన విద్యార్థుల స్కూల్ బిల్డింగ్ మొ.. సమస్యలను అర్జీల ద్వారా ప్రజాలనుంది తీసుకున్నారు.ఈకార్యక్రమంలో తంగరడోన టిడిపి నాయకులు మరియు ఆస్పరి మండల టిడిపి క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు, గ్రామ బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న మండల మరియు తాలూకా ప్రజా ప్రతినిధులు ఐటిడిసి టిఎన్ఎస్ఎఫ్ , టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు మండల టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
