భారత్ పై వైఖరి మార్చుకున్న `ఫిచ్` !
1 min readపల్లెవెలుగువెబ్ : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్.. భారత్‌పై వైఖరిని మార్చుకుంది. ‘బీబీబీ మైనస్’గా ఉన్న దేశ సార్వభౌమ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించినప్పటికీ.. రెండేళ్ల తర్వాత మళ్లీ భవిష్యత్ వైఖరిని నెగిటివ్ నుంచి న్యూట్రల్ కి పెంచింది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరాఘాతంతో స్వల్పకాలిక అవరోధాలు ఎదురుకానున్నప్పటికీ, శరవేగ ఆర్థిక పునరుద్ధరణతోపాటు ఆర్థిక సేవల రంగం మళ్లీ పుంజుకుంటుండటంతో మధ్యకాలిక వృద్ధి అవకాశాలకు ముప్పు తగ్గిందని ఫిచ్ అభిప్రాయపడింది.