రాయలసీమలో రుతుపవనాల ప్రవేశం ఎప్పుడంటే ?
1 min read

పల్లెవెలుగువెబ్ : నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ఏపీలోకి విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు పేర్కొంది. అలాగే మధ్య అరేబియా సముద్రం, గోవాలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని భాగాల్లోకి విస్తరిస్తాయని పేర్కొంది.

