NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూత్రాశయంలో కోడిగుడ్డు పరిమాణంలో ఐదు రాళ్లు

1 min read

విజయవంతంగా తొలగించిన” కిమ్స్ ఐకాన్ వైద్యులు

సంవత్సరాలుగా తీవ్రమైన నొప్పి, మూత్ర సమస్యలు

50 ఏళ్ల వ్యక్తికి ఉపశమనం

విశాఖపట్టణం, న్యూస్​ నేడు: మూత్రాశయం, కిడ్నీలలో రాళ్లు ఉండడం మనం చూస్తాం.. అవి కూడా సాధారణ పరిమాణంలో ఉంటాయి. అయితే విశాఖపట్టణానికి చెందిన ఓ వ్యక్తి మూత్రశయంలో కోడి గడ్డు పరిమాణంలో ఉన్న రాళ్లను తొలగించి ఉపశమనం కలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, లాపరోస్కోపిక్ యూరో-ఆంకాలజిస్ట్ & ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ మహేశ్వర రెడ్డి కల్లం తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన ఓ వ్యక్తి (50) కి రోగి గత కొన్ని సంవత్సరాలుగా కింది పొత్తికడుపు నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మంట, తరచుగా మూత్రం రావడం, పదేపదే యూరినరీ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతూ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్స్ లో మమల్ని సంప్రదించారు. ఇక్కడ చేసిన స్కానింగ్‌, ఇతర నిర్ధారణ పరీక్షల్లో మూత్రాశయంలో భారీ రాళ్లు ఉన్నట్లు తేలింది. మూత్రాశయంలో, కిడ్నీలలో సాధారణ పరిణామంలో చూస్తాం కానీ ఈ వ్యక్తిలో మాత్రం కోడి గుడ్డు పరిణామంలో ఉండడం అశ్చర్యాన్ని కలిగించింది. అయితే రాళ్ల పరిమాణం మరియు సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మా బృందం ప్రత్యేక శస్త్రచికిత్సను ప్రణాళికబద్ధంగా చేశాం. శస్త్రచికిత్సలో అన్ని రాళ్లను విజయవంతంగా తొలగించడంతో రోగికి తక్షణ ఉపశమనం లభించింది. శస్త్రచికిత్స అనంతరం సాధారణ స్థితికి చేరుకున్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూత్ర విసర్జన చేయగలుగుతాడు. మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటానికి మూత్రం నిల్వ ఉండటం, మూత్ర మార్గంలో అడ్డంకులు, తరచూ ఇన్‌ఫెక్షన్లు, ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వంటి కారణాలు ప్రధానమన్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే పదేపదే ఇన్‌ఫెక్షన్లు, రక్తస్రావం, మూత్రం పూర్తిగా ఆగిపోవడం, మూత్రాశయం దెబ్బతినడం, కిడ్నీలపై ప్రభావం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మూత్ర విసర్జనలో నొప్పి, మూత్రంలో రక్తం కనిపించడం, తరచూ ఇన్‌ఫెక్షన్లు, మూత్రం పోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సతో కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న ఆధునిక యూరాలజీ సేవలు, నిపుణుల వైద్య బృందం ప్రతిభ మరోసారి నిరూపితమైంది.  శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని, భవిష్యత్తులో రాళ్లు మళ్లీ ఏర్పడకుండా తగినంత నీరు తాగడం, ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించాం.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *