మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ తగదు
1 min readటిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ……
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌశ్రీ నారా చంద్రబాబునాయుడుని అక్రమంగా అరెస్ట్‌చేసి జైలుకు తరలించిన నేపధ్యంలొ రాష్ట్ర పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం హోళగుంద మండల కేంద్రములో టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పాయ్యని మైనారిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శ అదం గారిని టీడీపీ యువ నాయకులు మోయిన్ మరియు సీనియర్ నాయకులు గదిలింగా ను అదేవిధంగా TNSF మండల అధ్యక్షుడు నాగరాజు ను తదితర నాయకులను పోలీసులు ముందు అరెస్ట్ చేయడం తగుదని వారు అన్నారు రానున్న రోజుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని గద్ద దింపే విధంగా టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు సైన్యంలో పనిచేస్తామని వారు హెచ్చరించారు మరియు ఈ అక్రమ అరెస్టు వల్ల ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు అని వారు హెచ్చరించారు. మరియరాష్ట్ర ప్రజలు మంచి పాలన కావాలంటే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని అలాగే చంద్రబాబు బాబు నాయుడు గారి అక్రమ అరెస్ట ను నిరసిస్తూ ప్రజలు స్వచ్చందంగా బంద్ కు పిలుపునిచ్చిన ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి దౌర్జన్యాన్ని పాలన జరుగుతుందన్నారు ఈరోజు టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా బందును విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదం, గాది లింగ, మోయిన్, తదితరులు పాల్గొన్నారు.