రాఘవేంద్రుని సన్నిధి లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, శివమొగ్గ లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు రాఘవేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వచ్చారు. వీరికి మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరి కి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శాలువ కప్పి మొమొంటో ఆశీర్వదించారు. వీరి వెంట మఠం అధికారులు ఉన్నారు.