NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న  మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  గుండె సంబంధిత తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న ఒక నెల వయసున్న శిశువుకు చికిత్స కోసం తల్లిదండ్రులు పలుచోట్ల ఆసుపత్రులు తిరిగారు. తిరుపతి వంటి ప్రాంతాల్లో శిశువుకు గుండె ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, దానికి లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ విషయం బాబు తల్లిదండ్రులు మాజీ శాసనసభ్యులు యం.ఏ. హఫీజ్ ఖాన్  దృష్టికి తీసుకురావడంతో, ఆయన వెంటనే స్పందించి సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి శిశువుకు అవసరమైన గుండె ఆపరేషన్ మరియు చికిత్సను ఏర్పాటు చేశారు.గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడంతో ప్రస్తుతం శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ సందర్భంగా బాబు తల్లిదండ్రులు హఫీజ్ ఖాన్ ని కలిసి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.సామాన్య ప్రజల కష్టసమయాల్లో అండగా నిలుస్తూ మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న హఫీజ్ ఖాన్  సేవలను పలువురు ప్రశంసించారు.

About Author