NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్సీబీ హెడ్ కోచ్‌గా సంజయ్ బంగర్

1 min read


పల్లెవెలుగు వెబ్:
ఆర్సీబీ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఎంపికయ్యారు. వచ్చే ఐపీఎల్ రెండు సీజన్లకు బెంగళూరు జట్టుకు ఆయన సేవలు అందించనున్నారు. ఈమేరకు ఆర్సీబీ యాజమాన్యం బంగర్‌ను హెడ్ కోచ్‌గా నిమించినట్లు ప్రకటించింది. సంజయ్ బంగర్ ఇప్పటికే ఆర్సీబీతో కలిసి పని చేస్తున్నారు. గత కొన్ని సీజన్ల నుంచి ఆయన బ్యాటింగ్ కో‌చ్‌గా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ తొలి దశ జరుగుతున్న సమయంలో ఆర్సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్… వ్యక్తిగత కారణాలతో రెండో దశకు దూరమయ్యారు. దీంతో, ఆయన స్థానంలో మైక్ హెన్సస్ హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టారు. అయితే ఇకపై ఆయన ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీకి కొత్త కెప్టెన్‌‌గా ఎవరినీ నియమిస్తారోనన్న ఆసక్తి ప్యాన్స్‌లో నెలకొంది.

About Author