NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిల్లలకు ఉచిత సహాయ ఉపకరణాల కొరకు నిర్ధారణ శిబిరాలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు:  నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష ఆలింకో వారు సంయుక్తంగా నంద్యాల జిల్లా డోన్ శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత సహాయ ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని 26 -11 -25 వ తేదీ డోన్  బాలికల ఉన్నత పాఠశాలలో 0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల మానసిక వైకల్యం,శారీరక వైకల్యం, సెరిబ్రల్ పాలసీ, బహుళ వైకల్యం మరియు వెనికిడి లోపం గల పిల్లలకు మాత్రమే ఆలింకో వారి నిర్ధారణ పరీక్షలు డోన్ శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తారు ఆ పిల్లలకు అవసరమైన వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, క్యాలిఫర్స్, చేతి కర్రలు, రోలేటర్స్ ,వినికిడి యంత్రాలు మరియు మానసిక వైకల్యం గల పిల్లలకు బోధన సామాగ్రి ఎవరికి ఏం అవసరం ఉంటాయో వాటిని ఉచితంగా ఇచ్చుటకు నిర్ధారణ శిబిరాలు నిర్వహించబడును కావున శిబిరానికి దివ్యాంగ విద్యార్థితోపాటు తల్లి గాని తండ్రి గాని ఒకరు హాజరై నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము హాజరైన పిల్లవానికి తండ్రి లేదా తల్లికి లేదా సంరక్షకునికి రవాణా ఖర్చులతో పాటు మధ్యాహ్న భోజన ఖర్చులు కూడా ఇవ్వబడును కావున దివ్యాంగ విద్యార్థులుతల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అని Peapully Zphs boys school HM పద్మ బాయి మరియు రమేష్ నాయుడు,Ierp వెంకట్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author