ఏలూరు జిల్లా కారాగారంలో ఉచిత హోమియో వైద్య శిబిరం
1 min read
డా:అబ్బూరి అరుణ,శ్యామల ఖైదీలకు వైద్య పరీక్షలు,మందులు పంపిణీ
కృతజ్ఞతలు తెలియజేసిన జైలు సూపరింటెండెంట్సిహెచ్.ఆర్.వి.స్వామి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా జైల్ సూపరింటెండెంట్ సిహెచ్.ఆర్.వి.స్వామి ఆధ్వర్యంలో ప్రముఖ హోమియో వైద్య నిపుణులు,శ్యామల హోమియో హాస్పిటల్ & నాన్ అఫిషియల్ విజిటర్ డాక్టర్ అబ్బూరి అరుణ మరియు డాక్టర్ బండారు సుదీప్తి ల నేతృత్వంలో మంగళవారం ఏలూరు జిల్లా కారాగారంలో హోమియో ఉచిత వైద్య శిబిరంను నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ మార్పులు జరిగే సమయంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని ముందు జాగ్రత్తగా వైరల్ ఫీవర్స్ నివారణకు హోమియో మందులు అందించటం జరుగుతుందని, ఎటువంటి దుష్ప్రభావం లేకుండా ఉపయోగపడతాయన్నారు.ఈ సందర్భంగా 200మంది సిబ్బంది, ఖైదీలకు హోమియో మాత్రలు మూడు రోజులకు సరిపడ అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో జైలర్స్ కె.శ్రీనివాసరావు,వి.రమేష్,నాన్ అఫిషియల్ విజిటర్,రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎల్. వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు ను అభినందించారు.
