పెదపాడు శాఖ గ్రంధాలయంలో ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం
1 min read
పర్యవేక్షించిన గ్రంథాలయ శాఖ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు
పిల్లలకు మాజీ ప్రధాని జోహార్ లాల్ నెహ్రూ జీవిత చరిత్ర బోధన
ఇండోర్ గేమ్స్,క్యారం బోర్డ్ పాటలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం విద్యార్థిని విద్యార్థులకు డీ.కె.చదువుల బాబు రచించిన”అప్పు-నిప్పు” పుస్తకంలోని అధిక ప్రసంగం అనే కథను విద్యార్థులచే చదివించడం, పుస్తక సమీక్ష చేయించడం జరిగినది. అనంతరం రీసోర్స్ పర్సన్ స్థానిక శ్రీ గురుకులం పాఠశాల ఉపాధ్యాయురాలు సురపనేని సుజనా కుమారిచే తొలి భారత ప్రధాని “జవహర్ లాల్ నెహ్రూ” జీవిత చరిత్రను విపులంగా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిగా తెలియపరచి,బాల బాలికలను కొన్ని ప్రశ్నలు అడుగుతే జరిగినది. తరువాత ఇండోర్ గేమ్స్ లో భాగంగా క్యారమ్స్ ఆట నేర్పించి ఆడించుట జరిగినది. ఈ కార్యక్రమమునకు 28 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనినారు, ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగిoది. పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ మంచినీరు అందించారు.