దొంగ నోట్ల ముఠా అరెస్ట్ .. స్కానర్లు స్వాధీనం
1 min read– ముగ్గురి అరెస్టు
– వివరాలు వెల్లడించిన సీఐ రామకృష్ణారెడ్డి
పల్లెవెలుగువెబ్, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లోని తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్ల చెలామణి చేస్తున్న ముగ్గురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. జొన్నగిరి లో ఓ చికెన్ సెంటర్ వద్ద నిందితులు నకిలీ 100 రూపాయల నోట్లను చలామణి చేస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు సిఐ రామకృష్ణారెడ్డి విలేకరులకు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఖాజా, కసాపురం గ్రామానికి చెందిన నూర్ భాషా, ఖాసీం బి గత కొంత కాలంగా దొంగనోట్లు చలామణి చేస్తున్నారు.
తమకు వచ్చిన సమాచారం మేరకు ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా… యూట్యూబ్ లో దొంగ నోట్ల తయారీ ని చూసి స్కానర్ లతో ప్రింట్ చేసినట్లు అంగీకరించారు. ముద్దాయిల నుంచి నకిలీ నోట్ల ప్రింట్ చేసే స్కానర్లు, 27 నకిలీ వంద రూపాయలు, 2300 ఒరిజినల్ వంద రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సిఐ తెలిపారు. జొన్నగిరి ఎస్సై రామాంజనేయులు స్థానిక పోలీసులు సీఐ వెంట ఉన్నారు.