NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్లోబల్ స్టార్ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప:  సినీ నటుడు, గ్లోబల్ స్టార్నందమూరి తారక రామారావు, జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కడప నగరం పాత రిమ్స్ వద్దగల ఆదరణ నిరాశ్రయుల వసతి గృహంలో శనివారం ఉదయం తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ పి, రామారావు యాదవ్, నరేష్, హర్ష, సుబ్బారాయుడు, పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్ ఆధ్వర్యంలో తారక్ 40 పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం అల్పాహార కార్యక్రమము చేపట్టడం జరిగింది, ముఖ్యఅతిథిగా మసా పేట శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్ ఫాన్స్ అసోసియేషన్ పి, రామారావు యాదవ్, మాట్లాడుతూ సినీ ఆకాశంలో ఒక పెద్ద స్టార్ గా వెలుగొందటమే కాకుండా, ఆయన అభిమానులకు కొండంత అండగా నిలబడడం జరిగింది, అందుకే ఆయనను అభిమానులందరూ ముద్దుగా చిన్న రామయ్య, తారక్ అని పిలుచుకుంటారని ఆయన తెలియజేశారు. తాతకు తగ్గ మనవడని, తండ్రికి తగ్గ తనయుడు అని, బాబాయ్ కి తగ్గ అబ్బాయి అని, ముఖ్యంగా ఆయన రాజకీయ విస్ఫోటనమని ఆయన తెలియజేశారు తారక్ ఫ్యాన్స్ యూత్ నరేష్, హర్ష, సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ప్రపంచం మొత్తం తన నటన వైపు చూసేలా తన నటన ప్రతిభను యావత్ ప్రపంచానికి చూపిన గ్లోబల్ స్టార్ నందమూరి తారక రామారావు అని ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ పది కాలాలపాటు చల్లగా ఉండాలని అభిమానులు అందరము కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విక్రమ్, బ్రహ్మయ్య, అనూష్, హరి, మోహన్, అజయ్, గంగరాజు సురేంద్ర మల్లి ఆది, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

About Author