నాటు సారా రహిత ఏపీ యే లక్ష్యం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: దిన్నెదేవరపాడు గ్రామంలో నాటు సారా రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యసాధన కోసం నవోదయం టు పాయింట్ ఓ లో భాగంగా నాటసార అవగాహన కార్యక్రమంతో పాటు గ్రామ పెద్దల సమక్షంలో ఒక గ్రామ సభ నిర్వహించి నాటు సారావలన కలుగు అనర్థాల గురించి వివరించి నాటు సారాను పూర్తిగా మానివేయాలని నాటుసారా అనే మహమ్మారి మన జిల్లాలోనే లేకుండా చేయాలని సారా రహిత ఆంధ్ర ప్రదేశ్ గా మారాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యానికి మనము త్వరలో చేరుకోవాలని ఉన్నతాధికారులు అందరూ కూడా తెలియజేశారు అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ కర్నూలు శ్రీమతి శ్రీదేవి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు ఎస్టిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి మరియు సిఐ చంద్రహాస్ మరియు ఎస్ఐ నవీన్ కుమార్ మరియు సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.