సామాన్యులకు గుడ్ న్యూస్ !
1 min readపల్లెవెలుగువెబ్ : వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు కాస్త తగ్గడంతో భారతదేశంలో కూడా వంటనూనెల ధరలు తగ్గబోతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు వంటనూనెల ధరల్ని తగ్గించాయి. మరోసారి ధరలు తగ్గించబోతున్నట్టు సమాచారం. పామ్‌ఆయిల్ కిలో 65 రూపాయల నుంచి 135 రూపాయలకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు 15 శాతం నుంచి 20 శాతానికి తగ్గాయి. దాని ప్రభావం పామ్‌ఆయిల్ తోటలు సాగుచేసే రైతులపై విపరీతంగా పడింది. గెలల ధర ఒక్కసారిగా 25 శాతం పడిపోయింది. వాస్తవానికి జూలై 15న టన్ను పామాయిల్ గెలల ధర 23వేల నుంచి 20 వేల రూపాయలకు పడిపోయింది. ఒక్కసారిగా 3 వేలు పడిపోయినప్పటికీ రైతులు పెద్దగా ఆందోళన చెందలేదు. అంతర్జాతీయ దిగుమతులు పెరగడంతో..అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు తగ్గడంతోపాటు రష్యా-ఉక్రెయిన్ దేశాల యుద్ధ ప్రభావం కూడా తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల రంగంలో భారీ కుదుపు మొదలైంది.