PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ నెల 15న ముఖ్యమంత్రి ప్రారంభించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల..

1 min read

– ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 15 న నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలను లాంఛనంగా ప్రారంభించి మొదటి ఏడాది మెడికల్ విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇవ్వడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలను వర్చువల్ గా గౌ. ముఖ్యమంత్రి విజయనగరం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్న సందర్బంగా సంబంధిత ఏర్పాట్లను బుదవారం జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి పరిశీలించారు. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజి ల మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థులతో గౌ. ముఖ్యమంత్రి విజయనగరం జిల్లా లో కార్యక్రమం లో పాల్గొనడం జరుగుతుందని, మిగిలిన జిల్లాల వారితో వర్చువల్ ద్వారా ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఎంపిక చేసిన జిల్లాలకు చెందిన వైద్య విద్యార్ధులతో గౌ.ముఖ్యమంత్రి వర్యులు ముఖా ముఖి సంభాషించడం జరుగుతుందని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నూతనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను నిర్ణీత సమయం లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. తోలిబ్యాచ్ వైద్య విద్యార్థులతో జెసి లావణ్యవేణి ముఖా ముఖి సంభాషిస్తూ తొలి బ్యాచ్ తరగతులు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభం అయ్యాయని అన్నారు. కొత్త కాలేజీ, కొత్త వసతి కల్పించడం జరిగిందని, జీజీహెచ్ ప్రిన్సిపల్, ఇతర బోధనా సిబ్బంది నియామకం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా నూతన మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన తరగతిగదులను పలు విభాగాలను ఆమె పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ కె. విజయకుమార్, ఏలూరు ఆర్డిఓ ఎస్.కె. ఖాజావలి, డియంహెచ్ఓ డా. శర్మిష్ట,  నగరపాల సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, ఏలూరు తహశీల్దార్ బి. సోమశేఖర్, ఎపిఎంఎస్ఐడి కో-ఆర్డినేటర్ సునీల్ కుమార్, ఇఇ రాజబాబు,  తదితరులు పాల్గొన్నారు.

About Author