ఏస్ అగ్రి బిజినెస్ ప్రవేట్ సంస్థతో ప్రభుత్వం ఎంఓయూ
1 min read
మంత్రి టీజీ భరత్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ప్రతినిదులు
రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతమే లక్ష్యం
మంత్రి టిజి భరత్
అమరావతి, న్యూస్ నేడు: ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ, రాష్ట్రంలోని రైతు ఉత్పత్తి ధారుల సంఘాల బలోపేతం మరియు మార్కెటింగ్ నెటవర్క్ పై న్యూఢిల్లీలోని నోయిడాకు చెందిన ఏస్ అగ్రి బిజినెస్ ప్రవేట్ సంస్థతో రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ గుప్తా సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని రైతు ఉత్పత్తి దారుల సంఘాలను సంఘటితం చేసి వారికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం, ఆహార శుద్ధి యూనిట్స్ ఏర్పాటు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పాతులను ప్రోత్సహించడం, రైతులకు శిక్షణ కార్యక్రమాలు కల్పించడం జరుగుతుందని మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఈ సంస్థ అధిక విలువ ఆధారిత పంటలు అయిన కోకో, కాఫీ, కొబ్బరి, మిరప (ఎండు) పసుపు మరియు మిరియాలు మొదలగు వాటిపై రైతు ఉత్పత్తి దారుల సంఘాల ద్వారా ప్రతేక్యమైన మార్కెటింగ్ నెట్ వర్క్ కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ (ఫుడ్ ప్రాసెసింగ్) చిరంజీవ్ చౌదరి, ఇండస్ట్రీస్ మరియు కామర్స్ శాఖ సెక్రటరీ డా. యువరాజ్, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. శేఖర్ బాబు గెడ్డం, ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్, ఏస్ అగ్రి బిజినెస్ ప్రవేట్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త్రివేణి సతి పాల్గొన్నారు.

