PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వ సహకారం

1 min read

– దివ్యాంగులకు అందించిన వాహనాలకు హెల్మెట్ వాడకం తప్పనిసరి : జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వ సహకారంలో భాగంగా ప్రభుత్వం అందించిన ద్విచక్రవాహనాలకు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.స్ధానిక కలెక్టరేట్ ఆవరణంలోని కోడుమూరు నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు నూతన ద్విచక్ర వాహనాలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ వారి చేతుల మీద వారికి అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నియోజకవర్గంలోని దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు ఒకరిపై ఆధార పడకుండా స్వశక్తితో స్వయంగా ఎక్కడికైనా వెళ్లి వారి పనులను చేసుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.1.20వేల రూపాయల వ్యయంతో కూడిన ద్విచక్ర వాహనాలు ఉచితంగా వారికి అందజేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందజేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు చేయూతను అందించాలనే ఉద్దేశంతో వారికి ద్విచక్ర వాహనాలు మంజూరు చేసిందన్నారు. దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లి వారు కోరుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలని వారిని ప్రోత్సహించారు.కార్యక్రమంలో దివ్యాంగులు మరియు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి విజయ తదితరులు పాల్గొన్నారు.

About Author