శ్రీ నాగప్ప తాత కట్ట వద్ద ఘనంగా ప్రత్యేక పూజలు – పాలాభిషేకాలు
1 min read
సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు
హోళగుందన్యూస్ నేడు : హోళగుంద మండల కేంద్రంలోని ఎం.ఆర్.ఓ. కార్యాలయం సమీపంలో ఉన్న శ్రీ నాగప్ప తాత కట్ట వద్ద శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాగప్ప తాతకు పాలాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు.వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులకు పంటలు బాగా పండాలని, మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, హోళగుంద మండలం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుతూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం మండలంలోని గ్రామ పెద్దలు, బుడగజంగాల కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగించారు.ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.శ్రీ నాగప్ప తాత ఆశీస్సులతో మండలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ఆకాంక్షించారు.


