జనసేన సమన్వయకర్తగా గుడిపాడు ప్రభాకర్
1 min read
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా మిడుతూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల యువనేత సంగన్న గారి ప్రభాకర్ ను నియమిస్తూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాబితాను విడుదల చేశారు.నందికొట్కూరు సమన్వయకర్తలుగా ముగ్గురిని నియమించారు. నల్లమల రవికుమార్, గుడిపాడు ప్రభాకర్, బ్రాహ్మణకొట్కూర్ షేక్ వలీ భాష లను నియమించారు. అదేవిధంగా నియోజకవర్గ నిర్వాహక దళ్ కమిటీ సభ్యులుగా 32 మంది మరియు సపోర్టు టీం సభ్యులుగా ఐదుగురిని ఈ నియోజకవర్గం నుండి ఎంపిక చేశారు.ఈ కమిటీ సభ్యులు అందరూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ దిశా నిర్దేశం చేసింది.గుడిపాడు ప్రభాకర్ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఎన్నికైనందున జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.అతి చిన్న వయసులో పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభాకర్ అధినేత పవన్ కళ్యాణ్ కు మరియు కర్నూలు జిల్లా జనసేన పార్టీ ఇంచార్జి చింతా సురేష్ బాబు,రాష్ట్ర డైరెక్టర్ వెల్ఫర్ వాల్మీకి తోళ్ళ మంజునాధ్, ఐటి వింగ్ సాధనగిరి లక్ష్మీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.


