భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి దినోత్సవ వేడుకలు
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో మహా మంగళ హారతులు ,ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు అత్యంత ప్రీతిపతమైన గురువారం గురు పౌర్ణమి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముక్కులు తీర్చుకున్నారు, అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి భక్త బృందం వారు పాల్గొన్నారు.