హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు సేవలు అభినందనీయం -మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వినియోగదారులకు అందిస్తున్న సేవలు అభినందించదగ్గవని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు నూతన బ్రాంచ్ ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు స్థాపించిన అనతి కాలంలోనే బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, శాఖలను విస్తరించడం అభినందనీయమన్నారు. మన ప్రాంతంలో డిపాజిట్లు తక్కువగా, చెల్లింపులు ఎక్కువగా ఉంటాయని, అయినప్పటికీ దేశంలో వివిధ ప్రాతంలో సేకరించిన డిపాజిట్లు ఇక్కడ వ్యాపారం చేసేవారికి బ్యాంకు ద్వారా చేయూతనిస్తున్న యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 50 లక్షల పైగా ఖాతాదారులు ఉన్నటువంటి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని టీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది విజయమోహన్ రెడ్డి, శశాంక్ సుందరం, వేణుగోపాల్ రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.