PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆయ‌న హ‌త్య కేసులో న్యాయ‌విచార‌ణ చేయాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి. వివేకా హత్య కేసుతో అవినాశ్‌రెడ్డికి సంబంధం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 160 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఎవరికి ఓట్లు వేయాలో ప్రజలకు తెలుస‌ని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకూ అసెంబ్లీలోకి అడుగు పెట్టనని చెప్పాడని… చంద్రబాబు జీవితంలో అసెంబ్లీలోకి రాలేడని ఆ రోజే మేము నిర్ణయించుకున్నామ‌ని అన్నారు. రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని చెప్పారు.

                                           

About Author