PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయా.. ఆయ‌నే బ‌య‌ట‌కు తీసుకొచ్చారు : ఎన్టీఆర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. త‌న జీవితంలో రాజ‌మౌళి పాత్ర ఏంట‌నేది స్ప‌ష్టం చేశారు. “18 ఏళ్లకే సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చా. రెండో సినిమాకే స్టార్‌ స్టేటస్‌ చూశా. ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. ఆ సమయంలో డిప్రెషన్‌కి గురయ్యా. సినిమా విజయం సాధించనందుకు బాధపడలేదు. భవిష్యత్‌ ఎలా ఉండబోతుందనే విషయంపై మానసిక ఒత్తిడికి గురయ్యా. అపజయాన్ని కష్టంగా భావించా. ఆ సమయంలో పని కూడా చేయలేకపోయేవాడిని. అంతా గందరగోళంగా అనిపించేది. ఆ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది రాజమౌళినే. కష్టకాలంలో నా వెంటే ఉన్నాడు. నాలోని ప్రతికూల ఆలోచనలను పోగొట్టి ఉన్నత వ్యక్తిగానే కాదు.. చక్కటి నటుడిగా తీర్చిదిద్దాడు’’ అని ఎన్టీఆర్‌ చెప్పారు.

                                

About Author