శరీర తత్వాన్ని బట్టి డైట్ తో ఆరోగ్య ప్రయోజనాలు
1 min read
డాక్టర్ మాకాల సత్యనారాయణ
విజయవాడ న్యూస్ నేడు : వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నగరంలోని అశోక్ నగర్ ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘డైట్ అండ్ ప్రాణ శక్తి ‘ఒక రోజు శిక్షణను యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ నిర్వహించారు. శరీర తత్వాన్ని బట్టి డైట్ తీసుకోవడం ద్వారా అంతర కాలుష్యాన్ని తగ్గించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని మరియు సరైన ఆహారంతో ఆరోగ్యం పెంపొందించవచ్చునని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.శరీర తత్వము, అవయవాల పనితీరు కనిపెట్టి, జీవ గడియారం ప్రకారం తీసుకునే ఆహారం అనేక రుగ్మతలను తగ్గించి ఇక ముందు వ్యాధుల బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలో శిక్షణ ఇవ్వబడింది. దేశంలో మొట్టమొదటి గా నిర్వహించిన ఈ శిక్షణ పొందిన వారు అనేక రుగ్మతలు తగ్గించుకునే లాగా ఉన్న ఆరోగ్య విధానం అని ప్రశంసించినారు.యోగశక్తి సాధనా సమితి విజయవాడ వీరికి సర్టిఫికెట్స్ అందించటం జరిగింది.