PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరో విశ్వ‌క్ సేన్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హీరో విశ్వక్‌ సేన్‌పై అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ హ్యుమర్‌ రైట్‌ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం ఆశోకవనంలో అర్జుణ కల్యాణం త్వరలో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్‌తో సూసైడ్‌ ప్రయత్నం చేసుకునే విధంగా ప్రాంక్‌ వీడియో చేయించింది చిత్ర బృందం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ హీరో విశ్వక్‌ సేన్‌, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్‌ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్‌కు అంతారాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్‌ ప్రేస్‌లో సినిమా ప్రమోషన్స్‌ చేయకుండ చూసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ ఫిర్యాదును హెచ్‌ఆర్‌సీ స్వీకరించింది.

                                      

About Author