హిజాబ్.. అసలు ఇదొక సమస్యే కాదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : హిజాబ్ వివాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ప్రజల మతపరమైన మనోభావాల్ని తమ రాష్ట్రంలో గౌరవిస్తామని, బీహార్ లో అసలు ఇదొక సమస్యే కాదని అన్నారు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరిస్తే దానిపై అసలు కామెంట్ చేయాల్సిన అవసరమే లేదన్నారు. బీహార్ లో ఇదొక సమస్యే కాదని, తాము ఇలాంటివి పట్టుంచకోమని అన్నారు. ఇదంతా పనికిరాని వ్యవహారమని చెప్పారు. బీహార్ పాఠశాలల్లో పిల్లలంతా ఒకే రకమైన దుస్తులు ధరిస్తారని, ఎవరైనా తలపై ఏదైన పెట్టుకుంటే దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.