హిందుత్వమంటే ఆత్మస్వరూప జ్ఞానమే
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: హిందుత్వమంటే నిత్యము, శాశ్వతము అయిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమేనని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ధార్మిక సభా కార్యక్రమంలో వారు ప్రసంగించారు. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ఎస్.భానోజీరావు చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిరిగిరి సుజాత, ఉమ్మడి కర్నూలు జిల్లా విశ్రాంత జిల్లా వైద్య అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు, మండల ఆరోగ్య పర్యవేక్షకులు అశ్వాటి రాముడు, జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర్ రెడ్డి, గ్రామ సత్సంగ సభ్యులు కొమారి ఆంజనేయులు, ఎల్. మద్దిలేటి గౌడ్, కె.వెంకటేశ్వర్లు, శరబన్న, తూర్పాటి సామన్న, నరేంద్ర గౌడ్, కాశయ్యాచారి, యం.స్వామన్న, తిరుపతయ్య, రాముడు గౌడ్, ఆదినారాయణ, లక్ష్యాగౌడ్, నారాయణ గౌడ్, గోవిందు, లక్ష్యరాముడుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.