PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్స్‌ల్లో సమంత ఒకరు. కొన్నేళ్లుగా ఆమె కథా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటిస్తుంది. ‘పుష్ప’ లో ఐటం సాంగ్ చేసినందుకు దాదాపుగా రూ. 5కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకుంది. కాల్షీట్స్‌ను బట్టి సమంత ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ. 3కోట్ల నుంచి రూ. 8కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. దక్షిణాదిలో అధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌ల్లో న‌య‌న‌తార‌ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు నయన్ రూ. 5కోట్ల నుంచి రూ.7కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. అనుష్క శెట్టి.. స్వీటీ ఒక్కో చిత్రానికి రూ. 6కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. పూజా హెగ్డే.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లోను మూవీస్ చేస్తుంది. కథ, డేట్స్ ను బట్టి ఆమె రూ.2.5 కోట్ల నుంచి రూ. 7కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటుంది. ర‌ష్మిక మంద‌న్న రూ. 2కోట్ల నుంచి రూ.2.5కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తాప్సీ ఒక్కో సినిమాకు రూ.3కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది. కాజల్ అగర్వాల్.. ఆమె ఒక్కో చిత్రానికి కాల్షీట్స్‌ను బట్టి రూ.1.5 నుంచి రూ. 4కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. తమన్నా భాటియా.. ఒక్కో చిత్రానికి రూ. 4కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకు ఆమె ఛార్జ్ చేస్తుంది. ఐటం సాంగ్‌లో నటిస్తే రూ. 50లక్షల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. ర‌కుల్ ప్రీత్ .. ఒక్కో చిత్రానికి రూ. 1.5కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది.

                                     

About Author