నిత్య అన్నదాన పథకానికి భారీ విరాళం …
1 min read
విజయవాడ, న్యూస్ నేడు : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి భారీ విరాళం అందింది. గెసిమెళ్ల గ్రామానికి ఏలూరు మండలం చెందిన భక్తులు జి. సదానంద భాస్కర్ రావు మరియు భారతీ దేవి దంపతులు ₹1,11,111/- (అక్షరాలా ఒక లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు) విరాళంగా సమర్పించారు.ఈ మేరకు న దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దాతల నుంచి ఈ విరాళాన్ని స్వయంగా స్వీకరించి, వారికి రశీదును అందజేశారు.


