PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార్య‌ను భ‌ర్త కొట్ట‌డం క‌రెక్టే.. 84 శాతం మంది స‌మ‌ర్థింపు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. కొన్ని ప‌రిస్థితుల్లో భార్య‌ను భ‌ర్త కొట్ట‌డం స‌మంజ‌స‌మేన‌ని 14 రాష్ట్రాల్లోని 30 శాతం మంది మ‌హిళ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 84 శాతం మ‌హిళ‌లు దీనిని స‌మ‌ర్థించారు. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశం పై స‌ర్వే నిర్వ‌హించారు. `భార్య‌ను భ‌ర్త కొట్ట‌డం స‌మంజ‌స‌మేనా ? `అన్న ప్ర‌శ్న‌ను మ‌హిళ‌ల‌ను అడిగారు. భార్య‌కు వివాహేత‌ర సంబంధం ఉంద‌ని అనుమానించ‌డం, అత్తింటివారిని ఆమె గౌర‌వించ‌క‌పోవ‌డం, మొగుడితో ఆమె వాద‌న‌కు దిగ‌డం, భ‌ర్త‌తో శృంగారానికి నిరాక‌రించ‌డం, ఆయ‌న‌కు చెప్ప‌కుండా బ‌య‌టికి వెళ్ల‌డం, ఇంటిని, పిల్ల‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, మంచి ఆహారాన్ని వండ‌క‌పోవ‌డం వంటి ప‌రిస్థితుల్ని ఊహించుకుని స‌మాధానాలు చెప్పాల‌ని వారికి సూచించారు. మూడు రాష్ట్రాల్లో 75 శాతం మంది మ‌హిళ‌లు భార్య‌ను భ‌ర్త కొట్ట‌డం క‌రెక్టేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

About Author