డాలర్ శేషాద్రి కన్నుమూత
1 min read

పల్లెవెలుగు వెబ్: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో కార్తీక దీపోత్సవంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనకు తెల్లవారుఝామున 4 గంటలకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో ఆయన రిటైర్ అయినప్పటికీ ఆయన సేవలకు గుర్తింపుగా ఆలయ ఓఎస్టీగా నియమించారు. డాలర్ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టమని టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.

