అల్లూరు లో హైడ్రామా..!
1 min readటీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు
శివానంద రెడ్డిని అరెస్టు చేశారంటూ వదంతులు
భారీ ఎత్తున అల్లూరు చేరుకున్న టీడీపీ శ్రేణులు
వెనుదిరిగిన తెలంగాణ పోలీసులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం అల్లూరులో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వచ్చారు. తెలంగాణ లో భూ వివాదం విషయంలో నమోదయిన ఓ కేసు విచారణ నిమిత్తం ఉదయం దాదాపు 4.30 గంటల ప్రాంతంలో మాండ్ర ఇంటికి తెలంగాణ పోలీసులు చేరకున్నారు. శివానంద రెడ్డితో సమావేశం అయ్యారు. వారు వచ్చిన కారణం తెలియజేశారు. అయితే తనకు నోటీసు ఇచ్చి విచారించాలంటూ శివానందరెడ్డి పోలీసులను కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో టీడీపీ కార్యకర్తలు సమావేశం తను హాజరుకావాలని నోటీసులు ఉంటేనే విచారణకు సహకరిస్థానాన్ని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు తయారు చేసేలోపే ఆయన తన ఇంటి నుంచి కార్యకర్తల సమావేశానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.ఈ సమయంలో ఆయన వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకోబోయారు. కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. చేసేది లేక తెలంగాణ పోలీసులు వెనుదిరిగారు. మాండ్ర శివానంద రెడ్డి ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని వదంతులు వ్యాపించడంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ,గ్రామ ప్రజలు భారీ ఎత్తున అల్లూరు గ్రామానికి తరలివచ్చారు. ఈ నేపద్యంలో ఏ క్షణంలో ఏమి జరుగుతోందని ఉత్కంఠ నెలకొంది.