PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా నా వారిని కాపాడుకొంటా

1 min read

– కమలాపురంలో నీచ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహిస్తున్న నాయకులు
– తెలుగుదేశం నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆగ్రహం
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కమలాపురం కమలాపురం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నీచ రాజకీయ సంస్కృతికి కొందరు నాయకులు చేయూతనందిస్తూ నియోజకవర్గ రాజకీయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురంలో తన అనుచరుడు హత్య చేయడానికి కొందరు రాజకీయంగా కుమ్మక్కై చేసిన ప్రయత్నాల పట్ల శనివారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గంలో కిరాయి హంతకుల ద్వారా హతమార్చే నీచ రాజకీయ సంస్కృతిని కొందరు నాయకులు దగ్గర ఉండి ప్రోత్సహించడం సిగ్గుమాలిన చర్యగా ఆయన పేర్కొన్నారు. తన అనుచరులు కార్యకర్తల జోలికి వస్తే తాము సైతం ప్రతీకారం తీర్చుకొవడానికి వెనుకాడమని హె చ్చరించారు. తాము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మా దృష్టికి వచ్చిన సమాచారాన్ని పోలీసులకు అందించి వారి ద్వారా చట్ట ప్రకారమే తగిన చర్యలు చేపట్టాలని తాము కోరామన్నారు. తమ అనుచరుడు కల్లూరు జనార్దన్ రెడ్డి పై హత్యాయత్నం చేయాలనే కేసు లో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అభినందనీయమని దీనికి జిల్లా పోలీస్ సూపరిండెంట్ అన్బు రాజన్ గారికి ఇతర పోలీసు అధికారులకు సిబ్బందికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అయితే కిరాయి హంతకులను ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించడానికి పోలీసు వారికి తగిన స్వేచ్ఛ ఇవ్వకుండా వారిపై తీవ్ర ఒత్తిడి కావడం చూస్తుంటే కిరాయి హంతకులను వారిని ప్రేరేపించిన వారిని స్థానిక నాయకులు కాపాడడం కోసం పడుతున్న ఆరాటం చూస్తుంటే కొందరు నాయకులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. ఇటువంటి వారికి రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు . అవకాశమున్న ప్రతిచోట రాజకీయాలను వాడుకోవడం సిగ్గుచేటైన విషయమని ఆయన పేర్కొన్నారు. కిరాయి హంతకులను పట్టుకోవడంలో తమ విధి నిర్వహణను నిక్కచ్చిగా నిర్వహించిన పోలీసు అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు కూడా అదే విధంగా తీసుకోవాలని, రాజకీయ ఒత్తిడిలు పట్టించుకోవద్దని ఆయన కోరారు. రైతు సంఘం నాయకుడు కల్లూరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయంగా, ధర్మంగా వ్యవహరిస్తున్న తమ పట్ల కిరాయి హంతకుల ద్వారా దాడి చేయాలని ప్రయత్నించడం వారిని కొందరు నాయకులు ప్రోత్సహించడం అసమర్థ చర్య అన్నారు. సాయినాథ్ శర్మ అనుచరులను మట్టు పెట్టడానికి జరుగుతున్న ప్రణాళికలలో భాగంగా తనపై ఇటువంటి నీచమైన దురాగతాలకు ప్రణాళిక రచించడం సిగ్గుచేటన్నారు. తాము ప్రాణం పోయేంతవరకు సాయినాథ్ శర్మ వెన్నంటే ఉంటామన్నారు. విలేకరుల సమావేశంలో మండల నాయకులు అండ్లూరు రాజారెడ్డి పెద్ద చెప్పలి మాజీ సర్పంచ్ హరిత సుధాకర్, పెద్దచెప్పల్లి ఎంపీటీసీ నాగరాజాచారి, మైనారిటీ నాయకుడు మహమ్మద్ రఫీ తెలుగుదేశం పార్టీ నాయకులు నామాల రాజా, చిరంజీవి, నీరుగంటి రాజా తదితరులు పాల్గొన్నారు.

About Author